Nirmal: నిర్మల్ జిల్లాలో దొంగల బీభత్సం..వరుసగా ఐదు ఇళ్లలో చోరీ!
Nirmal: నిర్మల్ జిల్లా భైంసా మండలం వాలేగాంలో దొంగల హల్‌చల్. తాళం వేసి ఉన్న ఐదు ఇళ్లలో భారీగా బంగారం, వెండి, నగదు, బైక్ అపహరణ. సీసీటీవీలో దృశ్యాలు రికార్డు.
Nirmal: నిర్మల్ జిల్లాలో దొంగల బీభత్సం..వరుసగా ఐదు ఇళ్లలో చోరీ!
Nirmal: భైంసా మండలం వాలేగాం గ్రామంలో దొంగలు హల్‌చల్ చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు.. ఏకంగా ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. భారీగా బంగారు ఆభరణాలు, వెండి, నగదుతో పాటు ఓ బైక్‌ను కూడా అపహరించినట్లు సమాచారం.
చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.




