Indervelly: ఇంద్రవెల్లి మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడులు!
Indervelly: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు. 14 మంది అరెస్టు, రూ.2.24 లక్షల నగదు, మొబైల్స్, వాహనాలు స్వాధీనం.
Indervelly: ఇంద్రవెల్లి మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడులు!
Indervelly: అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో దసరా రోజు పేకాట ఆడే సాంప్రదాయంతో లక్షల రూపాయల చేతులు మారే సంస్కృతికి అడ్డుకట్ట వేశారు ఆదిలాబాద్ పోలీసులు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఓ జిన్నింగ్ మిల్లు లో గత రాత్రి పేకాట ఆడుతున్న స్థావరంపై ఆదిలాబాద్ టాస్క్ ఫోర్స్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని బృందం దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షల 24,100 నగదు, 14 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎఎస్పీ తెలిపారు. నిందితులను విచారించగా, స్థల యజమానికి తెలిసే అక్కడ పేకాట ఆడినట్లు వెల్లడించడంతో సదరు యజమాని రాజ్‌కుమార్ మిట్టల్ అలియాస్ గోరేసేట్ ప్రముఖ పారిశ్రామికవేత్త పై సైతం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. పట్టుబడ్డ నిందితుల్లో పలువురు వ్యాపారస్తులు, సమాజంలో పలుకుబడి ఉన్నవారిగా గుర్తించారు పోలీసులు.. ఉట్నూర్ ఎఎస్పి రుత్విక్ సాయి కొట్టే తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంద్రవెల్లిలో దసరా రోజు పేకాట ఆడే సాంప్రదాయం కొనసాగుతుందని, ఈ మేరకు తమకు అందిన సమాచారం తో దాడులు నిర్వహించామని తెలిపారు.. పత్తి మిల్లు లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలుసుకొని దాడులు నిర్వహించమని, ఈ దాడిలో పేకాట ఆడుతూ
14 మంది ని పట్టుకున్నామని తెలిపారు.. కట్టుబడి వారి వివరాలను తెలిపారు పోలీసులు.
1తెహెరె గణేష్ (32) S/o సీతారాం, నివాసం: ఇంద్రవెల్లి
2. జాదవ్ దత్త (29) S/o లక్ష్మణ్, నివాసం: హనుమాన్ గల్లి, ఇంద్రవెల్లి గ్రామం, మండలం.
3. జాదవ్ సతీష్ (35) S/o మిహినాథ్, నివాసం: జామిని గ్రామం, జైనూర్ మండలం.
4. కేంద్రే సందీప్ (40) S/o రామారావు, నివాసం: జామిని గ్రామం, జైనూర్ మండలం.
5. ముప్పవరపు వంశీ (29) S/o పంచాలయ్య, నివాసం: రాంనగర్, ఇంద్రవెల్లి గ్రామం, మండలం.
6. కాగ్నే గైనినాథ్ (29) S/o విఠల్, నివాసం: ఇంద్రవెల్లి గ్రామం, మండలం.
7. సూర్యవంశీ తథాగత్ (26) S/o గంగాధర్, నివాసం: సత్వాజిగూడ గ్రామం, ఇంద్రవెల్లి మండలం.
8. చింతవార్ సందీప్ (38) S/o హనుమాండ్లు, నివాసం: ఇంద్రవెల్లి గ్రామం, మండలం.
9. ఫడ్ విశాల్ (24) S/o ప్రహ్లాద్, నివాసం: సాయినగర్, ఇంద్రవెల్లి గ్రామం, మండలం.
10. పాండే సంతోష్ (29) S/o మాధవరావు, నివాసం: బజార్ గల్లి, ఇంద్రవెల్లి గ్రామం, మండలం.
11. ఫడ్ విజయ్ (27) S/o ప్రకాష్, నివాసం: బజార్ గల్లి, ఇంద్రవెల్లి గ్రామం, మండలం.
12. డగ్గే సుధాకర్ (30) S/o నారాయణ్, నివాసం: అంజీ గ్రామం, ఇంద్రవెల్లి మండలం.
13. నాన్లన్వార్ హృదయ్ (23) S/o చైత్రనాని, నివాసం: సాలేవాడ (బి) గ్రామం, ఉట్నూర్ మండలం.
14. గైక్వాడ్ నారాయణరావు (49) S/o నర్సింగరావు, నివాసం: ఇంద్రవెల్లి కి చెందిన వారిని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా పేకాట, గంజాయి, అక్రమ కార్యకలాపాలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని ఎఎస్పీ సూచించారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేరుగా పర్యవేక్షించే వాట్సాప్ నంబర్ 8712659973 కు సమాచారం పంపవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారితో పాటు వాటికి సహకరించే వారిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే హెచ్చరించారు.




