Nirmal: టైగర్ జోన్ పేరుతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆపొద్దు సీపీఐ(ఎంఎల్)!
Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలం ఇస్లాంపూర్ కొలాంగూడలో టైగర్ జోన్ పేరుతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవద్దని సీపీఐ(ఎంఎఎల్) నేత నందిరామయ్య డిమాండ్ చేశారు.
Nirmal: టైగర్ జోన్ పేరుతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆపొద్దు సీపీఐ(ఎంఎల్)!
Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలం ఇస్లాంపూర్ గ్రామ పరిధిలోని కొలాంగూడ గిరిజనులకు మంజూరైన 31 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను టైగర్ జోన్ పేరుతో అడ్డుకోవద్దని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ (ప్రజాపంథా) ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య కోరారు.ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో TNGO'S ఆఫీస్ నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి. ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీవో దేవదాస్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నంది రామయ్య మాట్లాడుతూ కొలాంగూడకు చెందిన 31 మంది గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయని, సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో తమ నివాస గుడిసెలను తొలగించుకుని నిర్మాణ పనులు ప్రారంభించారని తెలిపారు. కొందరు పునాదులు తవ్వగా, మరికొందరు సిమెంటు బీములు వేసుకున్న సమయంలో టైగర్ జోన్‌లో ఉందంటూ ఫారెస్టు అధికారులు నిర్మాణాలను అడ్డుకున్నారని పేర్కొన్నారు. దీంతో దాదాపు ఏడాదిగా ఎండకు ఎండుతూ, వానకు నానుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే సమస్యను కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదని నందిరామయ్య పేర్కొన్నారు. వెంటనే తగిన ఆదేశాలు జారీ చేసి ఇళ్ల నిర్మాణాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, నిర్మాణం ప్రారంభించిన 31 ఇళ్లకు బిల్లులు చెల్లించాలని కోరారు.
ఫారెస్టు అధికారుల వేధింపులను ఆపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో AIUKS జిల్లా నాయకులు సిడాం సోనేరావ్, గ్రామ నాయకులు సిడాం భీమ్‌రావ్, ఆత్రం రాము తదితరులు పాల్గొన్నారు.




