Adilabad: ఆదిలాబాద్ సర్వే నంబర్ 170 కాలనీలో మున్సిపల్ సిబ్బందిపై రాళ్ల దాడి!
Adilabad: ఆదిలాబాద్ సర్వే నంబర్ 170 కాలనీలో అక్రమ కట్టడాన్ని తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బందిపై మధుకర్ అనే వ్యక్తి రాళ్లతో దాడి చేయడంతో కలకలం రేగింది.
Adilabad: ఆదిలాబాద్ సర్వే నంబర్ 170 కాలనీలో మున్సిపల్ సిబ్బందిపై రాళ్ల దాడి!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ లోని సర్వే నంబర్ 170 కాలనీలో మున్సిపల్ సిబ్బందిపై ఓ వ్యక్తి రాళ్లతో దాడి చేయడం కలకలం రేపింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అక్రమంగా ఉంటున్న వారిని మున్సిపల్ అధికారు ఖాళీ చేయించారు. ఈ క్రమంలో అక్కడ నివాసముంటున్న మధుకర్ అనే వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన కట్టడాన్ని అధికారులు గుర్తించారు.
దానిని తొలగిస్తుండగా ఆగ్రహించిన మధుకర్ సిబ్బందిపై రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. మధుకర్ మున్సిపల్ సిబ్బందిపై దాడి చేస్తున్న సందర్భంగా రాళ్లు ఎవరి మీద పడతాయో అని సిబ్బంది పరుగులు తీశారు. రాళ్ల దాడిలో వ్యక్తికి గాయాలు కాగా మున్సిపల్ సిబ్బంది ఫై రాళ్ల దాడికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




