Basara: ఆలయ పునర్నిర్మాణంలో గర్భాలయ కృష్ణ శిలకు శాస్త్రోక్తంగా పూజలు!
Basara: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గర్భాలయ కృష్ణ శిలకు ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Basara: ఆలయ పునర్నిర్మాణంలో గర్భాలయ కృష్ణ శిలకు శాస్త్రోక్తంగా పూజలు!
Basara: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిఆలయపునర్నిర్మాణంలో భాగంగా ఆలయ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.శనివారం గర్భాలయ కృష్ణ శిలకు శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఆధ్వర్యంలో వైదిక బృందం కృష్ణశిలకు ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆలయ సమగ్ర అభివృద్ధి రూ.354 కోట్ల వరకు భారీ నిధులను మంజూరు చేసినప్పటికీ,ప్రధాన గర్భాలయ నిర్మాణాన్ని ఆలయ నిర్మాణ దాత సురపునేని సునంద పద్మప్రియ సహకారం అందించిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ విశేష పూజా కార్యక్రమంలో ఆలయ ఏ ఈ ఓ గంగా శ్రీనివాస్,ఆలయ అర్చక వైదిక బృందం,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




