Adilabad: అదిలాబాద్ మార్కెట్ యార్డ్‌‌లో పత్తి కొనుగోలు ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష!

Adilabad: అదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఈనెల రెండో వారంలో ప్రారంభం కానున్న పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్షించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 5 Oct 2026 7:44 PM IST
Adilabad
X

Adilabad: అదిలాబాద్ మార్కెట్ యార్డ్‌‌లో పత్తి కొనుగోలు ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష!

Adilabad: అదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈనెల రెండో వారంలో పత్తి కొనుగోలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో చేపడుతున్న ఏర్పాట్లపై స్వయంగా ఎస్పీ, మార్కెట్ మున్సిపల్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ,బండారి అనూష, మార్కెట్ అధికారులతో కలిసి సమీక్షించారు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రాంతంలో ఇబ్బందులు లేకుండా చూస్తామని, అదేవిధంగా రైతుల పంట మార్కెట్ యార్డ్ నుంచి ఎలాంటి చోరీ జరగకుండా భద్రత ఏర్పాటు చేస్తామని, నిరంతరం పోలీస్ నిఘా ఇక్కడే ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. పంట ఉత్పత్తులను మార్కెట్కు తీసుకువచ్చే రైతులకు కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.