Nirmal: నిర్మల్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా గణనాథుని నిమజ్జనోత్సవం!
Nirmal: నిర్మల్ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో గణనాథుని నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల.
Nirmal: నిర్మల్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా గణనాథుని నిమజ్జనోత్సవం!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రతిష్టించిన ఘననాథుని నిమజ్జనోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ప్రత్యేక పూజలు నిర్వహించగా పోలీసు అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుందన్నారు. గణేశ్ మండపాల నిర్వాహకులు, ఊరేగింపులో పాల్గొనేవారు పోలీసుల నిబంధనలు, సూచనలను కచ్చితంగా పాటించాలన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




