Nirmal: ప్రజావాణిలో ఫిర్యాదుదారుల సమస్యలు విన్న ఎస్పీ జానకి షర్మిల!
Nirmal: నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ జానకి షర్మిల ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Nirmal: ప్రజావాణిలో ఫిర్యాదుదారుల సమస్యలు విన్న ఎస్పీ జానకి షర్మిల!
Nirmal: నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు తెలిపిన సమస్యలను క్షుణ్ణంగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఫిర్యాదులను చట్టపరంగా పరిశీలించి, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజావాణి ద్వారా అందే ప్రతి ఫిర్యాదును బాధ్యతతో స్వీకరించి, దాని పరిష్కారానికి తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అనవసర జాప్యం లేకుండా, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారికి పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసు శాఖ దృష్టికి తీసుకువచ్చేలా ప్రజావాణి కార్యక్రమం ఉపయోగపడుతుందని ఎస్పీ తెలిపారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా సేవలందిస్తూ పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ జానకి షర్మిలపేర్కొన్నారు.




