Adilabad: గంజాయి మొక్క సమాచారం ఇస్తే రూ.50 నజరానా: ఎస్పీ అఖిల్ మహాజన్!
Adilabad: అదిలాబాద్ జిల్లాలో గంజాయి సాగుపై సమాచారం ఇస్తే మొక్కకు రూ.50 నజరానా ఇస్తామని ఎస్పీ తెలిపారు. గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.
Adilabad: గంజాయి మొక్క సమాచారం ఇస్తే రూ.50 నజరానా: ఎస్పీ అఖిల్ మహాజన్!
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ సాగుపై ఉక్కు పాదం మోస్తున్నారు పోలీసులు... గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం అందించిన వారికి ఒక్కో మొక్కకు 50 రూపాయల ప్రకటించారు, వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని తెలిపారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నామని.
గత సంవత్సరం అక్రమ గంజాయి సాగు చేసిన నిందితులకు సంబంధించి దాదాపు 250 ఎకరాల్లో రైతులకు రావలసిన రైతు బంధు పథకం నిలిపివేశారని, అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందే అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు గంజాయి సాగు చేసే వారికి నిలిపివేస్తామని తెలిపారు జిల్లా ఎస్పీ... గంజాయి సాగు , అక్రమ రవాణా చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, గంజాయి సమాచారం అందిస్తే, వివరాలు గోపిక ఉంచుతామని, ప్రతి మొక్కకు 50 రూపాయల చొప్పున నజరానా అందిస్తామని తెలిపారు ఎస్పీ.




