Gudihathnoor: కొల్లారిలో ఘనంగా ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం

Gudihathnoor: గుడిహత్నూర్ మండలం కొల్లారిలో ‘పోలీసులు మీకోసం’ సదస్సులో ఎస్పీ అఖిల్ మహాజన్ 23 సీసీ కెమెరాలు ప్రారంభించి, వైద్య శిబిరం, క్రీడా బహుమతులు పంపిణీ చేశారు.

NAGULA SATISH, BOATH
Published on: 24 Oct 2026 9:08 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: కొల్లారిలో ఘనంగా ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం

​గుడిహత్నూర్: ప్రజలతో సత్సంబంధాలు, నేరాల నియంత్రణే లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గుడిహత్నూర్ మండలం కొల్లారిలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లారి, మన్నూరు, లింగాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 23 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. గ్రామాల భద్రతకు సీసీటీవీలు ఎంతో అవసరమని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా 10 మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు.

​కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం మండల స్థాయి వాలీబాల్ పోటీల ఫైనల్ మ్యాచ్‌ను ఎస్పీ స్వయంగా ఆడి ప్రారంభించి, గెలుపొందిన గుడిహత్నూర్, సోయంగూడ, ఉమ్రి జట్లకు నగదు బహుమతులు అందజేశారు. అలాగే బతుకమ్మ పోటీల విజేతలైన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ, ఎస్సై, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH