Adilabad: ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసుల నాకాబంది ఎస్పీ అఖిల్ మహాజన్
Adilabad: ఆదిలాబాద్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లావ్యాప్తంగా నాకాబంది నిర్వహించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, పత్రాలు లేనివారిపై చర్యలు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసుల నాకాబంది ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణాలను అరికట్టేందుకు ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లావ్యాప్తంగా నాకాబంది నిర్వహించడం జరిగింది.
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పట్టణాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ, నంబర్ ప్లేట్ లేకుండా, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి జీవన్ రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




