Nirmal: భైంసా మార్కెట్లో సోయా ధర రికార్డు క్వింటాలు రూ.7,279!
Nirmal: నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్లో సోయాకు రికార్డు ధర. క్వింటాలుకు ఏకంగా రూ.7,279 లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు.
Nirmal: భైంసా మార్కెట్లో సోయా ధర రికార్డు క్వింటాలు రూ.7,279!
Nirmal: నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో సోయా ధర దూసుకెళ్లింది. రైతులకు ఊరటనిచ్చేలా సోయాకు రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ సోయాకు ఏకంగా 7 వేల 279 రూపాయలు ధర లభించింది.
గత కొన్ని రోజులుగా సోయా ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు తమ పంటను భారీగా మార్కెట్కు తరలిస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన ఈ రికార్డు ధరతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయి ధర రావడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్లో ఇదే ధరల జోరు కొనసాగితే తమకు పెట్టుబడి పోను మంచి లాభం చేకూరుతుందని, నష్టాల నుంచి బయటపడతామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా సోయాకు మద్దతు ధరను పెంచి రైతులను ఆదుకోవాలని.




