Adilabad: ఆదిలాబాద్లో 'ముడుపు మౌనిష్ రెడ్డి సైన్యం' ప్రారంభం!
Adilabad: ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా ఉంటానన్న సామాజిక కార్యకర్త ముడుపు మునిసిరెడ్డి. ఆదిలాబాద్లో 'ముడుపు మౌనిష్ రెడ్డి సైన్యం' ప్రారంభం, 300 మంది యువకులు చేరిక.
Adilabad: ఆదిలాబాద్లో 'ముడుపు మౌనిష్ రెడ్డి సైన్యం' ప్రారంభం!
Adilabad: ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటానని సామాజిక కార్యకర్త ముడుపు మునిసిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ముడుపు మౌనిష్ రెడ్డి సైన్యం విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామాజిక సేవలో తనతో కలిసి వచ్చిన యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన సుమారు 300 మంది యువకులు మునిసిరెడ్డి యువ సైన్యంలో చేరగా వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన, రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించమన్నారు. నిరుపేద కుటుంబంలో ఉండి చదువులో రాణిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడే వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. అదేవిధంగా జిల్లాలో ప్రస్తుత ఎల్ నీ నో ప్రభావంపై విస్తృత ప్రచారం కల్పిస్తామని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. సమాజ సేవ కోసం తాపత్రయం ఉన్నవారు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.




