Nirmal: నిర్మల్‌లో షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన!
Nirmal: నిర్మల్ జిల్లా హరితవనంలో మహిళలు, యువతుల కోసం షీ టీమ్ ఆధ్వర్యంలో భద్రత, చట్టాలు మరియు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ. పూర్తి వివరాలు.
Nirmal: నిర్మల్‌లో షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన!
Nirmal: నిర్మల్ జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో హరితవనంలో మహిళలు, యువతులకు మహిళల భద్రత, చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ విధులు, ఫిర్యాదు చేసే విధానం, ఫిర్యాదుదారుల వివరాల గోప్యత, మహిళలపై వేధింపులు, సైబర్ దాడులు, బాల్యవివాహాల నిరోధం, మహిళల అక్రమ రవాణా, అదృశ్య ఘటనలు, T-Safe యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.
మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే భయపడకుండా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. వేధింపులకు సంబంధించిన సందేశాలు, ఫొటోలు, ఇతర ఆధారాలను భద్రపరచుకోవాలని, సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు, OTPలు, బ్యాంకు సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని తెలిపారు.
సైబర్ ఆర్థిక మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 ద్వారా పోలీసుల సహాయం పొందాలని వివరించారు. మహిళలు, బాలికల భద్రత విషయంలో ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, వేధింపులు లేదా బాల్యవివాహాలు వంటి ఘటనలు గుర్తించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
మహిళలు, బాలికలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, బాధితులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.




