Nirmal: నిర్మల్‌లో శశి హార్ట్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన మహేశ్వర్ రెడ్డి
Nirmal: నిర్మల్‌లోని స్వప్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శశి హార్ట్ కేర్ సెంటర్‌ను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
Nirmal: నిర్మల్‌లో శశి హార్ట్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన మహేశ్వర్ రెడ్డి
నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్వప్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శశి హార్ట్ కేర్ సెంటర్‌ను బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ప్రారంభమైన శశి హార్ట్ కేర్ సెంటర్ ద్వారా నిర్మల్ ప్రాంత ప్రజలకు ఆధునిక గుండె వైద్య సేవలు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. హార్ట్ కేర్ సెంటర్ నిర్వహణకు కృషి చేస్తున్న ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్య బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, జమాల్, మెడిసెమ్మ రాజు, కౌన్సిలర్లు గంజి రాజు, జింక సురేందర్ , శ్రీరామోజీ నరేష్, శశాంక్, అర్జున్, సాత్విక్, సూరజ్ నాయక్, నిర్మల్ పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, సరికెల గంగన్న (మాజీ ఎంపీపీ,) బీజేపీ నాయకులు పొన్నం నారాయణ గౌడ్, గిల్లి విజయ్, స్వప్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది, వైద్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




