Gudihathnoor: సేవా సంకల్ప అభియాన్‌లో విద్యార్థులకు బహుమతుల ప్రదానం!

Gudihathnoor: గుడిహత్నూర్‌లో సేవా సంకల్ప అభియాన్ విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు విజేతలకు బహుమతులు అందజేసిన ఎంపీ గోడం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్.

NAGULA SATISH, BOATH
Published on: 28 Sept 2026 7:02 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: సేవా సంకల్ప అభియాన్‌లో విద్యార్థులకు బహుమతుల ప్రదానం!

​గుడిహత్నూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఎంపీ గోడం నగేష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ హాజరై బహుమతులు అందజేశారు.

​ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.

​అనంతరం ఎంపీతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడిని పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గోపాల్ సింగ్, పాఠశాల ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH