Nirmal: నిర్మల్‌లో ఘనంగా సర్దార్ పటేల్ 151వ జయంతి

Nirmal: నిర్మల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 31 Oct 2026 4:05 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో ఘనంగా సర్దార్ పటేల్ 151వ జయంతి

నిర్మల్: భారతరత్న, ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ పటేల్ జీవితం త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తికి ప్రతీక అని, ఆయన ఆదర్శాలు ప్రతి భారతీయ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి, ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన సేవలను భారత ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, అయ్యన్నగారి భూమయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, నిర్మల్ పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, సోన్ మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, నిర్మల్ రూరల్ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీరామోజి నరేష్, కూన శశాంక్, మాజీ కౌన్సిలర్ బిట్లింగ్ నవీన్, ఏడిపెల్లి నరేందర్, బీజేపీ నాయకులు పొన్నం నారాయణ గౌడ్, కందుల హరీష్, గిల్లి విజయ్, ప్రసాద్, ముత్యాల బంటి తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL