Bhainsa: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్, ఒకరు మృతి!

Bhainsa: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

Srinivas, Mondol Bhainsa
Published on: 18 Nov 2026 12:13 PM IST
Bhainsa
X

Bhainsa: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్, ఒకరు మృతి!

Bhainsa: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు స్పాట్ లోనే చనిపోగా, మరొకరు సీరియస్ గా ఉన్నారు.

భైంసా పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద బాసర వైపు నుంచి భైంసా బస్టాండ్ కు వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ఘటనలో గోపాల్ నగర్ కాలనీకి చెందిన నాగేశ్ (38) అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు సయ్యద్ అమీర్ పరిస్థితి విషమంగా ఉంది.

సమాచారం అందుకున్న పట్టణ సీఐ సాయికుమార్, ఆర్టీసీ డిపో మేనేజర్ హరిప్రసాద్ లు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డెడ్ బాడీని ఏరియా ఆసుపత్రికి తరలించగా, సయ్యద్ అమీర్ కు వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa