Mancherial: మంచిర్యాల జిల్లాలో బీభత్సం: ఆర్టీఏ మెంబర్ ఇంటిపై దాడి!

Mancherial: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట వెంకట్రావుపేటలో RTA మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై దుండగుల దాడి. తాళం పగలగొట్టి కారు, టీవీ ధ్వంసం. పోలీసులు దర్యాప్తు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Updated on: 24 Oct 2026 10:55 AM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల జిల్లాలో బీభత్సం: ఆర్టీఏ మెంబర్ ఇంటిపై దాడి!

Mancherial: లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో దుండగులు బీభత్సం సృష్టించారు. అధికార పార్టీకి చెందిన ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు టీవీతో పాటు కారును ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన

అంకతి శ్రీనివాస్ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు టీవీని, కారును ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

రంగంలోకి దిగిన పోలీసులు

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు? దాడికి గల కారణాలేమిటి? అనే కోణాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం. నిందితుల వివరాలు, ఘటన వెనుక కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.