Nirmal: నిర్మల్‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి
Nirmal: నిర్మల్‌లోని కూచాడి శ్రీహరి రావు క్యాంపు కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.
Nirmal: నిర్మల్‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి
నిర్మల్: భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని కూచాడి శ్రీహరి రావు క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఇందిరా గాంధీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ దేశ పరిపాలనలో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.
దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమత్వ పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యంగా బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి కీలక నిర్ణయాలతో దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆమె ప్రవేశపెట్టిన పథకాలు భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు.
దేశం ఎదుర్కొన్న అనేక క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్న నాయకురాలిగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలు, ఆమె చేసిన త్యాగాలు, దేశం పట్ల చూపిన నిబద్ధత ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధి, ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఇందిరా గాంధీ అభిమానులు తదితరులు పాల్గొని ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు.




