Nirmal: 18 ఏళ్లుగా సేవలందిస్తున్న అధ్యాపకులకు 7వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్!

Nirmal: బాసర ఆర్జీయూకేటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, 7వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్.

RAMESH RATNELLI, BASARA
Published on: 25 Nov 2026 2:02 PM IST
Nirmal
X

Nirmal: 18 ఏళ్లుగా సేవలందిస్తున్న అధ్యాపకులకు 7వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్!

Nirmal: కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని పరిపాలనా భవనం ఎదుట ఆందోళనఆర్జీయూకేటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ అధ్యాపక సంఘం ఆధ్వర్యంలో పరిపాలనా భవనం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన విద్యార్థికి అధ్యాపక సంఘం నాయకులు, అధ్యాపకులు నివాళులర్పించారు.

ఈ ధర్నాలో పాల్గొన్న అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజేషన్ లేదా అబ్జార్ప్షన్ ప్రక్రియను పూర్తిచేసిన తర్వాతే కొత్త నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా సంస్థ అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు అంకితభావంతో సేవలందిస్తున్న అధ్యాపకులకు న్యాయం చేయకుండా కొత్త నియామకాలకు వెళ్లడం సమంజసం కాదన్నారు.

ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు అవసరమైన అన్ని విద్యార్హతలు, బోధనా అనుభవం ఉన్నాయని, జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల నుంచి అర్హత సాధించి సంస్థలో చేరిన అధ్యాపకులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. ఐదు విభిన్న స్థాయిలలో కాంట్రాక్ట్ అధ్యాపకులను నియమించుకున్న ఆర్జీయూకేటీలో, 18 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

అలాగే 7th పే రివిజన్ కమిషన్ (7వ పీఆర్సీ) ప్రయోజనాలను కాంట్రాక్ట్ అధ్యాపకులకు కూడా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్, డాక్టర్ ఉపేందర్ రావు, శ్రీశైలం, సతీష్ కుమార్, డాక్టర్ విజయకుమార్, శ్రీకాంత్, రజిత, చరణ్ రెడ్డి, రమాకాంత్, డాక్టర్ రాజేందర్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA