Nirmal: నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్‌గా రాథోడ్ రమేష్ బాధ్యతల స్వీకరణ!
Nirmal: నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా డీఆర్వో రాథోడ్ రమేష్ బుధవారం బాధ్యతలు స్వీకరణ. అధికారుల నుంచి ఘన స్వాగతం.
Nirmal: నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్‌గా రాథోడ్ రమేష్ బాధ్యతల స్వీకరణ!
Nirmal: నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా డీఆర్వో రాథోడ్ రమేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలువురు జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు రాథోడ్ రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా పరిపాలనలోని వివిధ అంశాలు, రెవెన్యూ శాఖకు సంబంధించిన కార్యక్రమాలపై అధికారులు ఆయనకు వివరాలు అందజేశారు. కార్యక్రమంలో డీపీఆర్వో విష్ణువర్ధన్, సివిల్ సప్లై డీఎస్‌ఓ రాజేందర్, డీఎం సుధాకర్, ఏఓ ప్రవీణ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




