Bazarhathnoor: మంజీరమ్ తాండాలో వైభవంగా ఋషి పంచమి వేడుకలు!
Bazarhathnoor: బజార్‌హత్నూర్ మండలం మంజీరమ్ తాండాలో ఋషి పంచమి వేడుకల్లో పాల్గొన్న బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం ప్రకటన.
Bazarhathnoor: మంజీరమ్ తాండాలో వైభవంగా ఋషి పంచమి వేడుకలు!
Bazarhathnoor: మండలంలోని మంజీరమ్ తాండలో మథుర సమాజ్ ఆధ్వర్యంలో ఋషి పంచమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి బోథ్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక జ్వాలాముఖి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంప్రదాయాలను కాపాడుకుంటూ ఏటా వేడుకలు జరపడం అభినందనీయమన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా రూ.1 లక్ష విరాళం అందజేస్తానని హామీ ఇచ్చారు.
ఈ పూజా కార్యక్రమాల్లో ధ్రయవ్ సింగ్ మహారాజ్, మథుర సమాజ్ ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




