Nirmal: నిర్మల్ గీతా పారిశ్రామిక సంఘం అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి!
Nirmal: నిర్మల్ గీతా పారిశ్రామిక సంఘంలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన గీతకార్మికులకు సభ్యత్వం ఇవ్వాలని గౌడ జన హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది.
Nirmal: నిర్మల్ గీతా పారిశ్రామిక సంఘం అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి!
Nirmal: నిర్మల్ : నిర్మల్ పట్టణంలో నిర్వహిస్తున్న గీతా పారిశ్రామిక సంఘం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన గీతకార్మికులకు సభ్యత్వం ఇవ్వాలని గౌడ జన హక్కుల పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు. నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గీత పారిశ్రామిక సంఘంలో నిజమైన గీత కార్మికులకు సభ్యత్వం ఇవ్వకుండా వ్యాపారులకు, ఉద్యోగులకు, రాజకీయ నేతలకు, బడా కాంట్రాక్టులకు సభ్యత్వం ఇచ్చి ఉపాధి కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. దీనిపై సంబంధిత ఎక్సైజ్ అధికారులకు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ప్రజా ఫిర్యాదు విభాగంలో కలెక్టర్కు ఫిర్యాదు అందజేసినట్లు తెలిపారు. ఈ గీత పారిశ్రామిక సంఘంలో పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా 11 విక్రయ కేంద్రాలు నిర్వహించవలసి ఉన్న 20 చోట్ల తెల్లకల్లు విక్రయాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ పట్టణంలో గీత వృత్తిపై ఆధారపడిన నిరుపేద గీతా కార్మికులకు, ఏ ఆధారం లేని కుటుంబ సభ్యులకు గీత పారిశ్రామిక సంఘంలో సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన గీత కార్మికులు దరఖాస్తు పెట్టుకున్నా సంఘం ప్రతినిధులు వాటిని తిరస్కరిస్తున్నారని ఆరోపించారు.
నిర్మల్ గీత కార్మిక సంఘంలో ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సభ్యత్వం తీసుకున్న పేర్లను ప్రకటించారు. ఈ అక్రమాలపై గీత కార్మికులు ఫిర్యాదు చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిజమైన గీతకార్మికులపై జరుగుతున్న అన్యాయాలు మాత్రమే తాము ఎత్తిచూపుతున్నామని, వారికి న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి విచారం జరిపి చర్యలు చేపట్టాలని, లేనట్లయితే వారం రోజుల్లో ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్, గౌడ ఐక్య సాధన పోరాట సమితి స్టేట్ జనరల్ సెక్రెటరీ పొన్నం నారాయణ గౌడ్, గౌడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్, విశాల్ గౌడ్, పొన్నం శివాజీ గౌడ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




