Nirmal: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత: కలెక్టర్ భవేశ్ మిశ్రా

Nirmal: నిర్మల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, సత్వర పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 2 Nov 2026 7:32 PM IST
Nirmal
X

Nirmal: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత: కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు.,ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు.

మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్ కు సమర్పించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవ రావు, రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL