Bhainsa: దుర్గాదేవి శోభాయాత్ర మార్గంలో ప్రమాదకర గుంతలు.. అధికారుల నిర్లక్ష్యం!

Bhainsa: భైంసాలో దుర్గాదేవి శోభాయాత్ర మార్గంలో ప్రమాదకర గుంతలను అధికారుల నిర్లక్ష్యం కారణంగా వార్డు కౌన్సిలర్, యువకులు ముందుకు వచ్చి పూడ్చివేశారు.

Srinivas, Mondol Bhainsa
Published on: 21 Oct 2026 6:22 AM IST
Bhainsa
X

Bhainsa: దుర్గాదేవి శోభాయాత్ర మార్గంలో ప్రమాదకర గుంతలు.. అధికారుల నిర్లక్ష్యం!

Bhainsa: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని 11వ వార్డులో దుర్గాదేవి శోభాయాత్ర వెళ్లే మార్గంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలు, మురికి కాలువ పక్కన ఉన్న ప్రమాదకర గుంతను మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారం రోజులుగా అధికారులకు, మున్సిపల్ చైర్మన్‌కు విన్నవించినా స్పందన లేకపోవడంతో 11వ వార్డు సభ్యుడు సల్లోల్ల నరేష్ ఆధ్వర్యంలో గణేష్ నగర్ యువకులు ముందుకొచ్చి గుంతలను పూడ్చివేశారు.

రేపే(బుధవారం)దుర్గాదేవి శోభాయాత్ర జరగనుండగా, ఈ మార్గంలో సుమారు 20 నుంచి 30 దుర్గామాత విగ్రహాలు వెళ్లనున్న నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సల్లోల్ల నరేష్ మానవతా దృక్పథంతో స్పందించి గుంతలను పూడ్చివేయడం అభినందనీయమని వీరికి తోడుగా నగర హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి ఎనుపోతుల మల్లేష్, గణేష్ నగర్ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు తోట రాము, పెరుగు నవీన్, చిన్న ముత్తన్న, చిట్యాల సాయినాథ్, గోపాల్ తదితరులు నిలిచారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa