Bhainsa: పోలీసుల ఫ్లాగ్ మార్చ్.. గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు!
Bhainsa: నిర్మల్ జిల్లా భైంసాలో గణేష్ నిమజ్జనం నేపథ్యంలో 700 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు. పట్టణంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ.
Bhainsa: పోలీసుల ఫ్లాగ్ మార్చ్.. గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు!
Bhainsa: భైంసాలో రేపు జరగనున్న గణేష్ నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకిషర్మిలా ఆధ్వర్యంలో సుమారు 700 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
నిమజ్జన మార్గాలు, కీలక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ జానకిషర్మిలా సూచించారు.




