Adilabad: ఆదిలాబాద్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Adilabad: ఆదిలాబాద్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ నివాళులు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 21 Oct 2026 11:34 AM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Adilabad: అదిలాబాదులో పోలీస్ అమరవీరుల దినోత్సవం... విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఛైర్‌పర్సన్ అనూష హాజరయ్యారు.

అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పోలీసులు నిస్వార్థమైన సేవలను అందిస్తారని వారికి ప్రతి ఒక్కరూ సహకరిస్తూ నేర నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.

పోలీస్ అమరువీరుల కుటుంబాలకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఎలాంటి సహాయ సహకారాలైన అందిస్తామని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో పోలీసులు చేసిన త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలని సూచించారు.

కేవలం నేరాల నియంత్రణే కాకుండా ప్రకృతి విపత్తులు మరియు అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ముందుండి సేవలు అందిస్తారని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు అగ్రస్థానంలో నిలవడానికి ఇక్కడి సిబ్బంది యొక్క కష్టపడే తత్వమే కారణమని ప్రశంసించారు. పోలీస్ అమరవీరుల త్యాగాల వల్లనే ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.