Adilabad: 8 మంది అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ల అరెస్ట్.. ఎస్పీ అఖిల్ మహాజన్!

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 8 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 4 Nov 2026 12:55 PM IST
Adilabad
X

Adilabad: 8 మంది అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ల అరెస్ట్.. ఎస్పీ అఖిల్ మహాజన్!

Adilabad: వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకొని పలు రాష్ట్రాలలో తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో మహిళల మెడలోని బంగారు గొలుసులను చాకచక్యంగా దొంగిలిస్తూ ప్రజలను మోసగిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

ఈ ముఠాలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు కలిపి మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగతనాలకు ఉపయోగించిన కారు, ఆటో, పది తులాల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

ఇందుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు ఎస్పి.. మహారాష్ట్రలోని వార్ధా ప్రాంతానికి చెందిన నిందితులు ఒక ముఠాగా ఏర్పడి మహారాష్ట్రతో పాటు తెలంగాణ, కర్ణాటక, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు తెలిపారు..నిందితులు కారు.

ఆటోలో ప్రయాణిస్తూ పట్టణాలకు చేరుకొని, ఒంటరిగా వెళ్తున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకునేవారన్నారు. ఆటోలో మహిళలను ఎక్కించుకొని, మాటలతో నమ్మించి, పక్కనే కూర్చున్న మహిళా నిందితురాలు వాంతులు చేసుకుంటున్నట్లు నటిస్తూ బాధితురాలి దృష్టిని మళ్లించి అదే సమయంలో మరో మహిళ బాధితురాలి మెడలోని బంగారు గొలుసును నోటితో కొరికి తింపి దొంగలుస్తారన్నారు అనంతరం బాధితురాలిని దింపేసి అక్కడి నుంచి పరార్ అయ్యవారని పేర్కొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.