Nirmal: ఘనంగా శ్రీ శ్రీ శ్రీ షఠగోప ముని రామానుజ జీయర్ స్వామి పాదపూజ!
Nirmal: నిర్మల్ పట్టణంలోని ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు ఆమడ శ్రీధర్ నివాసంలో శ్రీ శ్రీ శ్రీ షఠగోప ముని రామానుజ జీయర్ స్వామివారికి పాదపూజ ఘనంగా నిర్వహించారు.
Nirmal: ఘనంగా శ్రీ శ్రీ శ్రీ షఠగోప ముని రామానుజ జీయర్ స్వామి పాదపూజ!
Nirmal: నిర్మల్ పట్టణం నటరాజనగర్‌లోని ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు ఆమడ శ్రీధర్ నివాసంలో శనివారం పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ షఠగోప ముని రామానుజ జీయర్ స్వామివారికి పాదపూజ కార్యక్రమం జరిగింది. వేద పండితుల సమక్షంలో ఈ పాదపూజ నిర్వహించారు. భక్తులకు దివ్య ఆగమన తీర్థ గోష్ఠి, అనుగ్రహ భాషణం, ఆశీర్వచనం అందించారు. సమస్త భక్తజనులు, ఆస్తిక మహాశయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ జీయర్ స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకొని దివ్య ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో పురోహితులు రామకృష్ణ కన్నన్, జిల్లా సివిల్ సప్లై మేనేజర్ సుధాకర్, బీజేపీ రాష్ట్ర నాయకులు అయ్యన్నగారి భూమయ్య, కౌన్సిలర్ సాధం స్వప్న అరవింద్, నర్సారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.




