Nirmal: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడేలా ప్రత్యేక కృషి!
Nirmal: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన నోడల్ అధికారులు. విద్యార్థుల్లో ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించాలని ఉపాధ్యాయులకు ఆదేశం.
Nirmal: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడేలా ప్రత్యేక కృషి!
Nirmal: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని బూత్కూర్ మరియు దస్తురాబాద్ ప్రాథమిక పాఠశాలలను వారు ఆకస్మికంగా సందర్శించారు.
పాఠశాలల సందర్శనలో భాగంగా అధికారులు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను స్వయంగా పరీక్షించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకుని పాఠశాల విడిచి వెళ్లే సమయానికి, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు.
అనంతరం పాఠశాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి నుంచి సమాధానాలను రాబట్టారు. విద్యార్థుల ప్రతిభ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే, ఆంగ్ల నైపుణ్యాలను మరింత పెంపొందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట వేణు, అడిషనల్ నోడల్ ఆఫీసర్ నరసయ్య, అదనపు నోడల్ అధికారి మహేశ్వర్, ఐఆర్పి ఎడ్ల జగన్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.




