Nirmal: సిడ్నీలో ఘనంగా నిర్మల్ వాసుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు!
Nirmal: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఘనంగా నిర్మల్ వాసుల బతుకమ్మ సంబరాలు. తెలంగాణ సంప్రదాయ దుస్తులు ధరించి, ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్న ఎన్ఆర్ఐలు.
Nirmal: సిడ్నీలో ఘనంగా నిర్మల్ వాసుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు!
Nirmal: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో నిర్మల్ వాసులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు. నిర్మల్ పట్టణానికి చెందిన అందరూ ఒకచోట చేరి తెలంగాణ పాటలతో ఉర్రూతలూగించారు. విదేశీ గడ్డపై తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. సిడ్నీలో బతుకమ్మ వేడుకలతో తెలంగాణ పండుగ వాతావరణం వెల్లివిరిసింది. బతుకమ్మ చూసేందుకు విదేశీయులు సైతం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.




