Nirmal: బాసర గోదావరి బ్రిడ్జిపై యువకుడి హల్చల్ అప్రమత్తమై కాపాడిన సిబ్బంది

Nirmal: బాసర గోదావరి బ్రిడ్జిపై బైక్ కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు. అప్రమత్తమై ప్రాణాలు కాపాడిన వాగ్దేవి లేబర్ సిబ్బంది, బోటింగ్ సిబ్బంది, పోలీసులు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 28 Sept 2026 4:07 PM IST
Nirmal
X

Nirmal: బాసర గోదావరి బ్రిడ్జిపై యువకుడి హల్చల్ అప్రమత్తమై కాపాడిన సిబ్బంది

నిర్మల్: నిర్మల్ బాసర గోదావరి నది బ్రిడ్జి పైన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలానికి చెందిన నవీన్ యువకుడు హల్ చల్ చేశాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న వాగ్దేవి లేబర్ కాంట్రాక్ట్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది గమనించి అతన్ని పోలీసులకు అప్పచెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తనకు బైక్ కొనివ్వాలని ఇంటిలో గొడవ పడి గోదావరి బస్ బ్రిడ్జి నుంచి దూకి చనిపోతానని అందరికి ఉరుకులు పరుగులు పెట్టించిన యువకుడిని బైకు కొనిస్తామని కుటుంబ సభ్యులు హామీ ఇవ్వడంతో అతని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పచెప్పారు.

వాగ్దేవి లేబర్ కాంట్రాక్ట్ సిబ్బంది గణపతి,శ్రీనివాస్ మరియు బోటింగ్ సిబ్బంది గంగాధర్, నరేష్,సతీష్ మరియు పోలీస్ సిబ్బంది అందరు స్పందించి ఆ యువకునికి గోదావరి నది లో పడకుండా అతన్ని కాపాడినారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.