Nirmal: కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నిర్మల్ యువ నాయకుడు నల్లా వినయ్ రెడ్డి!
Nirmal: కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన నిర్మల్ జిల్లా లక్ష్మణచాందకు చెందిన యువ నాయకుడు నల్లా వినయ్ రెడ్డి.
Nirmal: కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నిర్మల్ యువ నాయకుడు నల్లా వినయ్ రెడ్డి!
Nirmal: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన ఓ రాజకీయ కుటుంబానికి చెందిన నల్లా వినయ్ రెడ్డి హైదరాబాదులోని కేటీఆర్ స్వగృహంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నల్ల వినయ్ రెడ్డికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
అంతకుముందు కేటీఆర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. అదేవిధంగా ఈనెల 11వ తేదీన నిర్మల్లో నిర్వహించే యువగర్జన సభ లో ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ రామ్ కిషన్ రెడ్డి, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నాయకులు జనసేన నాయక్, మరుగొండ రాము, అయ్యన్న గారి రాజేందర్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. వడ్యాల్ గ్రామానికి చెందిన నల్ల వినయ్ రెడ్డి ఎంబీఏ విద్యాభ్యాసం చేసి హైదరాబాదులో స్థిరపడ్డారు.
నల్ల వినయ్ రెడ్డి తాత నల్ల భీమ్ రెడ్డి గతంలో నిర్మల్ సమితి అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేశారు. అదేవిధంగా ఆయన పెద్దనాన్న నల్ల రాంరెడ్డి 30 సంవత్సరాలు సర్పంచ్ గా పని చేసిన అనుభవం ఉంది.
ఆయన పెద్దమ్మ కల్పన రాంరెడ్డి సైతం ఎంపీటీసీ తో పాటు పలు హోదాల్లో రాజకీయాల్లో ఉన్నారు. అదేవిధంగా ఆయన కుటుంబంతో సంబంధం ఉన్న నల్ల నరేందర్ రెడ్డి ఎంపీపీగా పనిచేశారు. నిర్మల్ నియోజకవర్గంలో కొత్త నాయకుడు రాజకీయంలో అడుగుపెడుతుండడంతో మార్పులు చోటు చేసుకోనున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.




