Dasturabad: బుట్టాపూర్‌లో ‘ఉల్లాస్’ అక్షరాస్యత పరీక్ష: మహిళల ఉత్సాహం
Dasturabad: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం బుట్టాపూర్ ఎంపీయూపీఎస్ పాఠశాలలో మహిళల కోసం ‘ఉల్లాస్’ అక్షరాస్యత ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని విజయవంతంగా నిర్వహించారు.
Dasturabad: బుట్టాపూర్‌లో ‘ఉల్లాస్’ అక్షరాస్యత పరీక్ష: మహిళల ఉత్సాహం
నిర్మల్ జిల్లా: దస్తురాబాద్ మండలంలోని బుట్టాపూర్ ఎంపీయూపీఎస్ (MPUPS) పాఠశాలలో మహిళలకు ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని నిర్వహించారు.
మహిళలందరూ విద్యావంతులై, స్వయంసమృద్ధి సాధించాలనే ఉన్నత ఆశయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఉల్లాస్’ (ULLAS) అక్షరాస్యత కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా కొనసాగుతోంది.
ఈ పరీక్షా కేంద్రానికి గ్రామ పరిధిలోని మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పరీక్షలు రాశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతినిధులు మాట్లాడుతూ.. చదువు అనేది కేవలం అక్షరాలకే పరిమితం కాదని, మహిళల జీవితాల్లో వెలుగులు నింపే ఒక అస్త్రమని పేర్కొన్నారు.
మహిళలు విద్యను అభ్యసించడం ద్వారా సమాజంలో తమ కళ్ళమీద తాము నిలబడటమే కాకుండా, కుటుంబాలను సైతం ఉన్నత స్థానాల్లో నిలబెట్టగలరని వివరించారు. నిరక్షరాస్యతను నిర్మూలించి, ప్రతి ఒక్కరినీ విద్యావంతులను చేయడమే ఈ ‘ఉల్లాస్’ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ విద్యా అవగాహన పరీక్షా నిర్వహణ కార్యక్రమంలో బుట్టాపూర్ గ్రామ సర్పంచ్ గుండా నరేష్, ఉప సర్పంచ్ దుర్గం రమణయ్య, వి.ఓ లీడర్ గుండా అంజవ్వ, ఐకేపీ (IKP) సిబ్బంది అంజయ్య తదితరులు పాల్గొని మహిళలకు దిశానిర్దేశం చేశారు. చదువుకోవడానికి వయసుతో నిమిత్తం లేదని, లభించిన ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.




