Nirmal: నిర్మల్‌లో గులాబీమయమైన సభావ్యవస్థ..ఘనంగా కేటీఆర్ రైతు గర్జన ఏర్పాట్లు!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు గర్జన సభ ఏర్పాట్లను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమన్ పరిశీలించారు.
Nirmal: నిర్మల్‌లో గులాబీమయమైన సభావ్యవస్థ..ఘనంగా కేటీఆర్ రైతు గర్జన ఏర్పాట్లు!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో రేపు నిర్వహించనున్న రైతు గర్జన సభ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రం పూర్తిగా గులాబీమయం అయింది. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రధాన కూడళ్ళలో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం నిర్వహించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.
నిర్మల్ లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న రైతు గర్జన సభ వేదిక, ఏర్పాట్లను మాజీ ఎంపీ బాల్క సుమన్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు, సలహాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎంతో గోస పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు, కరెంటు సరిగా సరఫరా కాకపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
దీంతోనే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు గర్జన పేరుతో సభలను నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు ముందుకెళ్తున్నారన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే రైతు గర్జన సభకు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రామ్ కిషన్ రెడ్డి, జాన్సన్ నాయక్, నాయకులు నల్ల వినయ్ రెడ్డి, మార్గొండ రాము, తదితరులు పాల్గొన్నారు.




