Dasturabad: ఐక్యత ద్వారానే హక్కుల సాధన 'హలో నేతకాని - చలో ఉస్మానియా'కు పిలుపు!

Dasturabad: దస్తురాబాద్‌లో నేతకాని విద్యార్థి సంఘం సమావేశం. ఎస్సీ వర్గీకరణ అన్యాయంపై నవంబర్ 15న 'హలో నేతకాని - చలో ఉస్మానియా' సభకు టీఎన్ఎంవీఎస్ పిలుపు.

RAKESH N, KHANAPUR
Published on: 17 Oct 2026 5:43 PM IST
Dasturabad
X

Dasturabad: ఐక్యత ద్వారానే హక్కుల సాధన 'హలో నేతకాని - చలో ఉస్మానియా'కు పిలుపు!

దస్తురాబాద్: ఐక్యత ద్వారానే హక్కులు సాధించబడతాయని, నేతకాని సమాజం తమ ఉనికిని చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ నేతకాని మహర్ విద్యార్థి సంఘం (TNMVS) రాష్ట్ర అధ్యక్షులు, ఓయూ జేఏసీ కన్వీనర్ సాయిని ప్రసాద్ నేత పిలుపునిచ్చారు.

దస్తురాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన నేతకాని కుల బాంధవుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణలో నేతకానీలకు జరిగిన అన్యాయంపై మండిపడ్డారు. నవంబర్ 15న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరగబోయే "హలో నేతకాని - చలో ఉస్మానియా" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ అన్యాయంపై పోరాడేందుకు నవంబర్ 15న నిర్వహించబోయే ఉస్మానియా సభకు దస్తురాబాద్ మండల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకొండపేట సర్పంచ్ జాడి మాధవి శంకర్, రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి రాజేశ్వర్, జిల్లా నాయకులు దుర్గం శంకర్, మునీసుల వినోద్, బుట్టాపూర్ ప్రెసిడెంట్ మోడెపు లింగన్న, రత్నం లక్ష్మణ్ తదితర నేతకాని కుల పెద్దలు, యువకులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR