Nirmal: బెంబర శివారులో చిరుత సంచారం.. గ్రామస్తుల్లో భయం!
Nirmal: నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెంబరలో చిరుత సంచారం: లేగదూడపై దాడి చేసి చంపిన చిరుతపులి. పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు, గ్రామస్తులకు కీలక హెచ్చరికలు.
Nirmal: బెంబర శివారులో చిరుత సంచారం.. గ్రామస్తుల్లో భయం!
నిర్మల్: నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెంబర గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత పాద ముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
చిరుత దాడిలో మృతి చెందిన లేగదూడ కళేబరంపై ఎలాంటి హానికర రసాయనాలు రైతులు చల్లవద్దని అధికారులు కోరారు. పశువులు మృతి చెందిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా చూస్తామని అధికారులు తెలిపారు.




