Nirmal: మాస్టర్ ప్లాన్‌పై తప్పుడు ప్రచారం తగదు చైర్మన్
Nirmal: నిర్మల్ మాస్టర్ ప్లాన్‌పై తప్పుడు ప్రచారం చేయడం తగదని మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, వైస్ చైర్మన్ కూటిజా సిద్ధిఖి విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
Nirmal: మాస్టర్ ప్లాన్‌పై తప్పుడు ప్రచారం తగదు చైర్మన్
నిర్మల్: పట్టణ మాస్టర్ ప్లాన్‌పై చర్చించేందుకు హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సమక్షంలో బుధవారం సమావేశం నిర్వహించామని చైర్మన్ దత్తత్రి, వైస్ చైర్మన్ బిబి కుతిజా సిద్ధికి ఇద్రిస్ బేగ్ అన్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల
సమావేశంలో వీరి ఇరువురు మాట్లాడుతూ... హిందూ–ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రతి దాంట్లో రాజకీయం చేస్తున్నారని,మాస్టర్ ప్లాన్ ద్వారా పట్టణానికి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అందించాలన్నదే మా లక్ష్యమని పేర్కొన్నారు.
గతంలో మాన్యువల్ విధానంలో అనుమతులు మంజూరు చేసే సమయంలో అక్రమాలకు పాల్పడుతూ లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు ఉండగా...ఈ మాస్టర్ ప్లాన్ అమలుతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. ఇలాంటివి జీర్ణించుకోలేక కావాలని ఉద్దేశంతో కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.
పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్‌పై ప్రజలు సానుకూలంగా ఆలోచించాలని, అధికారులపై వ్యక్తిగతంగా లేదా మతపరంగా ఆరోపణలు చేయకుండా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని వారు ఈ సందర్భంగా సూచించారు.




