Dasturabad: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై ప్రత్యేక క్యాంపులు

Dasturabad: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారుల సమావేశం జరిగింది. ఈ నెల 19 నుంచి 30 వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు.

RAKESH N, KHANAPUR
Published on: 17 Nov 2026 9:37 PM IST
Dasturabad
X

Dasturabad: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై ప్రత్యేక క్యాంపులు

దస్తూరాబాద్: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అదనపు పీడీ నాగవర్ధన్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారిని ఈ పథకంలో భాగస్వాములను చేయాలని సూచించారు.

క్యాంపుల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో ప్రజలకు ఈ బీమా పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, దరఖాస్తుల ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పలువురు మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR