Nirmal: అనుమానితుల గుర్తింపునకు కొత్త సాంకేతికత నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల

Nirmal: జనసమూహాల్లో అనుమానితుల గుర్తింపునకు ఎఫ్‌ఆర్‌ఎస్ (FRS) కొత్త మాడ్యూల్‌పై సమీక్షించిన నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల. నేరాల నియంత్రణలో సాంకేతికత వాడకంపై ఆదేశాలు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 4 Nov 2026 9:18 PM IST
Nirmal
X

Nirmal: అనుమానితుల గుర్తింపునకు కొత్త సాంకేతికత నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల

నిర్మల్: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) కొత్త మాడ్యూల్‌పై పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసమూహాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ముఖాల ఆధారంగా గుర్తించే విధానంపై వివరించారు. ఈ సాంకేతికత ద్వారా అనుమానిత వ్యక్తులను త్వరగా గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

అలాగే NAFIS (National Automated Fingerprint Identification System) ద్వారా వేలిముద్రల ఆధారంగా వ్యక్తులను గుర్తించే విధానం గురించి వివరించారు. నేర పరిశోధనలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఫింగర్ ప్రింట్ యూనిట్ నిర్మల్ సిబ్బంది, డీసీఆర్బీ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు మరింత సమర్థవంతంగా కృషి చేయాలని ఎస్పీ సూచించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL