Nirmal: నిర్మల్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి షర్మిల!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను ఎస్పీ జానకి షర్మిల శివాజీ చౌక్ నుండి బస్టాండ్ వరకు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
Nirmal: నిర్మల్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి షర్మిల!
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ను ఎస్పీ జానకి షర్మిల పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక శివాజీ చౌక్ నుండి బస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపున ట్రాఫిక్కు ఇబ్బందిగా మారిన వాటిని స్వయంగా పరిశీలించి తగు సూచనలు, సలహాలు అందజేశారు.
అదేవిధంగా జిల్లా కేంద్రంలో పార్కింగ్ను తమ తమ దుకాణాల ముందే నిలువచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పనితీరును పరిశీలించి ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.




