Nirmal: ఎగ్గామ్‌లో కంది పంటలో విత్తనోత్పత్తిపై రైతులకు శిక్షణ
Nirmal: నిర్మల్ జిల్లా ఎగ్గామ్‌లో కంది పంట విత్తనోత్పత్తిపై శాస్త్రవేత్తల అవగాహన. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యమని వెల్లడి.
Nirmal: ఎగ్గామ్‌లో కంది పంటలో విత్తనోత్పత్తిపై రైతులకు శిక్షణ
నిర్మల్ జిల్లా: రైతులకు మేలు రకమైన విత్తనాలు అందించడమే మా ఉద్దేశమని ప్రొఫెసర్ జయశంకర్ రావు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రాహుల్, దినేష్ లు అన్నారు. బైంసా మండలంలోని ఎగ్గామ్ గ్రామంలో పిఎసిఎస్ మిర్జాపూర్ ఆధ్వర్యంలో ఆరు ఎకరాలలో సాగు చేస్తున్న కంది పంటను పరిశీలించి మాట్లాడారు.
వ్యవసాయ పరిశోధన సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో కంది వన్, డబ్ల్యూ ఆర్ జి ఈ 97 రకాల విత్తనాలను విత్తనోత్పత్తి కొరకు పండిస్తున్నట్లు వివరించారు.
ఈ పండిన పంటను సొసైటీ ద్వారా కొనుగోలు చేసి విత్తన పరిశోధన సంస్థకు పంపి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందిస్తామని వెల్లడించారు. కంది సాగు చేస్తున్న రైతులకు పలు సూచనలను సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ రాజేందర్ సిబ్బంది సురేష్ రైతు కళ్యాణ ప్రసాద్ లతోపాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.




