Nirmal: నిర్మల్‌లో ఘనంగా పోలీస్ కుటుంబాల ఆత్మీయ బతుకమ్మ సంబరాలు!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి శ్రీవాణి, ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 20 Oct 2026 9:07 AM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో ఘనంగా పోలీస్ కుటుంబాల ఆత్మీయ బతుకమ్మ సంబరాలు!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం రాత్రి పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి ముఖ్య అతిథిగా హాజరుకాగా జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల కలిసి సంయుక్తంగా వేడుకలను ప్రారంభించారు.

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీస్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఒకే వేదికపై పాల్గొని బతుకమ్మ పాటలు, ఆటలతో సందడి చేశారు. ఎస్పీ మహిళలు, చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఇలాంటి వేడుకలు పోలీస్ కుటుంబాల మధ్య ఐక్యత, ఆత్మీయతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

పోలీసుల విధి నిర్వహణలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, పోలీస్ అధికారులు, సిబ్బంది, షీ టీమ్, భరోసా టీమ్ సభ్యులు, పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL