Nirmal: నిర్మల్ బీఆర్ఎస్ రైతు గర్జన సభ విఫలం ఎమ్మెల్యే బొజ్జు పటేల్

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు గర్జన సభ విఫలమైందని ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ విమర్శించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 12 Nov 2026 5:06 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ బీఆర్ఎస్ రైతు గర్జన సభ విఫలం ఎమ్మెల్యే బొజ్జు పటేల్

నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రైతు గర్జన పేరుతో నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని ఖానాపూర్ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు వెడుమ బుజ్జి పటేల్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతు గర్జన సభకు నిర్మల్ జిల్లా నుండి ప్రజలు రాకపోవడంతో పక్క జిల్లా నుంచి తరలించడంపై టిఆర్ఎస్కు ప్రజల్లో ఎంత అవగాహన ఉందో తెలిసిపోతుందన్నారు. పర్యావరణ విపత్తు అయిన ఎల్నినో ఏర్పడి రైతులు నష్టపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ తప్పెంటని దుయ్యబట్టారు.

కేటీఆర్ ఏదో ఊహించుకొని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్నారని, ఆ కల ఎప్పటికీ నిజం కాదన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో దివాలా తీస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బి ఆర్ ఎస్ పార్టీ అని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరొకసారి ప్రజలను మోసం చేసేందుకు బహిరంగ సభల పేరుతో ప్రజల మధ్యకు వస్తున్నారని, మోసం చేసే కుటుంబ పార్టీని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL