Nirmal: వినాయక సాగర్, మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
Nirmal: దసరా, బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధికారులకు సూచించారు.
Nirmal: వినాయక సాగర్, మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
Nirmal: దసరా, బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా వినాయకసాగర్ వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు, బారికేడ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అదేవిధంగా, దసరా పర్వదినం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే మహిషాసుర దహనం, దసరా ఉత్సవాల ఏర్పాట్లను కూడా ఎమ్మెల్యే గారు పరిశీలించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అనంతరం మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్, భూమయ్య, మేడిసెమ్మ రాజు, జమాల్ , తక్కల రమణారెడ్డి, సామ రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, పోడేల్లి గణేష్, పట్టణ అద్యక్షులు సుంకరి సాయి, బీజేవైఎం జిల్లా అద్యక్షులు దొడ్డికింది నిరంజన్ రెడ్డి, కందుల హరీష్, గిల్లి విజయ్, భరత్ , కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజీ నరేష్, శశాంక్, ఈశ్వర్, విట్టల్, వొడిసెల అర్జున్, సూరజ్ నాయక్, ముత్యం , తదితరులు పాల్గొన్నారు.




