Nirmal: నిర్మల్ డీఎస్పీకి పెద్ద భీమన్న జాతర ఆహ్వాన పత్రిక అందజేత!

Nirmal: నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారంలో అక్టోబర్ 21 నుంచి 26 వరకు జరిగే శ్రీ పెద్ద భీమన్న స్వామి జాతర ఆహ్వాన పత్రికను నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్‌కు అందజేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 19 Oct 2026 6:13 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ డీఎస్పీకి పెద్ద భీమన్న జాతర ఆహ్వాన పత్రిక అందజేత!

నిర్మల్: నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారం గ్రామంలో ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ పెద్ద భీమన్న స్వామి జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను నిర్మల్ డిఎస్పీ శ్రీనివాస్, సోన్ సిఐ గోవర్ధన్ రెడ్డి కి నాయకపోడ్ సేవా సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా అందజేశారు.

ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా నిర్వహించే శ్రీశ్రీశ్రీ పెద్ద భీమన్న స్వామి జాతర ఈ నెల 21-10-2026 (బుధవారం) నుండి 26-10-2026 (సోమవారం) వరకు వైభవంగా జరగనుందని తెలిపారు. జాతర ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 21 బుధవారం సాయంత్రం 7:30 గంటలకు స్వామి వారిని గుడి నుండి మరం (ఇంటి) వద్దకు తీసుకురావడం జరుగుతుందన్నారు.

అనంతరం అక్టోబర్ 22, 23, 24 తేదీలలో పరిసర ప్రాంతాల గ్రామాల్లో స్వామి వారి ఊరేగింపు నిర్వహించి 24వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు స్వామి వారు తిరిగి పోతారం మఠం వద్దకు చేరుకుంటారని వెల్లడించారు. అలాగే అక్టోబర్ 25 ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఊరేగింపు, సాయంత్రం 6 గంటలకు గంగ స్నానం, రాత్రి 12:30 గంటలకు గుడి వద్దకు గజాలు చేరుకుంటాయని తెలిపారు.

చివరి రోజు అక్టోబర్ 26 సోమవారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు బండారు వసంతం, అనంతరం భక్తుల మొక్కుల చెల్లింపుతో జాతర మహోత్సవం ముగుస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సంచు శ్రీనివాస్, సత్యనారాయణ, రామకృష్ణ, పోతారం గ్రామ ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL