Nirmal: నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం గ్రామస్తుల్లో భయాందోళన!
Nirmal: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అడుగుజాడలను గుర్తించిన అటవీ అధికారులు, ప్రజలను అప్రమత్తం చేశారు.
Nirmal: నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం గ్రామస్తుల్లో భయాందోళన!
Nirmal: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. మంగళవారం రైతు తావుటి రాములు తన వ్యవసాయ క్షేత్రంలో జంతువు అడుగుజాడలను గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు శివకుమార్, శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అవి చిరుత పులి అడుగులేనని నిర్ధారించారు. దీంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు సూచించారు




