Nirmal: నిర్మల్‌లో కాన్షిరామ్ వర్ధంతి, జేఏసీ నేతల నివాళి!

Nirmal: నిర్మల్‌లో కాన్షిరామ్ వర్ధంతి వేడుకలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను వక్తలు స్మరించుకున్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 9 Oct 2026 1:41 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో కాన్షిరామ్ వర్ధంతి, జేఏసీ నేతల నివాళి!

Nirmal: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మాన్యవార్ కాన్షిరాం చేసిన కృషి ఎనలేనిదని వక్తలు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్ ఎస్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో కాన్షిరం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతగానో పాటుపడ్డారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ బాధ్యులు యాటకారి సాయన్న, సగ్గం మోహన్ దాస్, రవి, రామగిరి రవీందర్, మోర స్వామి, సబ్బని మురళి, లీగల్ అడ్వైజర్ కొడుకు గంగాధర్ సుంకరి రాజు, లక్ష్మణచాంద, దిలావర్పూర్, సోన్. సారంగాపూర్ మండల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL