Khanapur: ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శంకుస్థాపన!

Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ తిమ్మాపూర్ వద్ద నూతన ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి ఈ నెల 21న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శంకుస్థాపన చేయనున్నారు.

RAKESH N, KHANAPUR
Published on: 19 Oct 2026 6:49 PM IST
Khanapur
X

Khanapur: ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శంకుస్థాపన!

ఖానాపూర్: ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ కొమురం భీం చౌరస్తా వద్ద నిర్మించనున్న నూతన అగ్నిమాపక కేంద్రం భవన నిర్మాణానికి ఈ నెల 21న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఇంఛార్జి అగ్నిమాపక అధికారి మామిడి భగవాన్ రెడ్డి తెలిపారు.

బుధవారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయనున్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.

నూతన అగ్నిమాపక కేంద్రం భవన నిర్మాణంతో ఖానాపూర్ పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనాలని జిల్లా అగ్నిమాపక అధికారి కోరారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR